టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్-జీవిత దంపతులపై జోస్టర్ ఫిలిమ్ సర్వీసెస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఓ సినిమా నిర్మించేందుకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఇప్పుడు వాటిని తిరిగి ఇమ్మంటే ఇవ్వడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నగరి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయితే, దీనిపై శనివారం జీవిత స్పందించారు. ‘శేఖర్’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు.
తమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని జీవితారాజేశేఖర్ అన్నారు. చెక్ చౌన్స్ కేసులో సమాన్లు తమకు అందలేదని.. అందకుండా చేశారని ఆమె చెప్పారు. జోస్టర్ ప్రొడెక్షన్‌కు సంబంధించి కోర్టులో రెండు నెలలుగా కేసు నడుస్తోందని.. తీర్పు వచ్చాక మాట్లాడుతానని తెలిపారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని జీవితా అన్నారు.
జోస్టర్ ఎండీ హేమ భర్త వల్ల తమ మేనేజర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని జీవిత ఆరోపించారు. తననెవరు అరెస్టు చేయలేదని, జైల్లో పెట్టలేదని వివరించారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవాలు లేవని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి కోటేశ్వరరావు ప్రొడ్యూసర్‌గా ఉన్నారని, సినిమాకి సంబంధించి అతనే డబ్బులు ఇవ్వాలని వివరించారు. ఇప్పుడు రూ. 26 కోట్ల రూపాయలు ఇవ్వాలని అంటున్నారని, వేసుకునే కోట్లా లేక డబ్బా అనేది తనకు తెలియదని సీరియస్ అయ్యారు. కోర్టులో వారు ఎలాంటి ఆధారాలు పెడుతారో చూడాలన్నారు.