హాలీవుడ్ పాపులర్ స్టార్లు జెన్నిఫర్ లోఫెజ్ అంటే తెలియని వారుండరు. 52 ఏళ్ల వయసులో కూడా ఆమె అందం మెయింటైన్ చేస్తోన్న తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమెలో వృద్ధాఫ్యం ఛాయలు అసలు ఏ మాత్రం కనిపించదు. అయితే, తాజాగా జెన్నీ తన బ్యూటీ సిక్రెన్‌ను అభిమానులతో పంచుకున్నారు. తను రోజు పాటించే కేవలం సింపుల్ స్టేప్స్ తన సౌందర్యాన్ని కాపాతున్నాయని ఆమె తెలిపారు.
జెన్నిఫర్ లోపెజ్.. తన ముఖ సౌదర్యం కోసం రోజు ఉదయాన్నే పాటించే సిక్రెట్ టిప్స్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కేవలం నాలుగు టిప్స్‌తో తన అందాన్ని మెరుగుపర్చుకున్నట్లు తెలిపారు. అంతేకాదు అవి చాలా సింపుల్ అండ్ ఈజీగా పాటించేవని చెప్పారు. ఇలా రోజు చేయటం ద్వారా మొహంలో గ్లో వస్తుందని వివరించారు.
ముందుగా ఆమె క్లిన్‌జర్‌తో మొహాన్ని శుభ్రపరుచుకోవాలని తెలిపారు. ఇది చర్మంపై మిగిలి ఉన్న మేకప్, డస్ట్, జిడ్డూ లాంటిది ఏమైనా ఉన్న తొలగిస్తుందని చెప్పారు. అనంతరం ఫేస్ సిరమ్‌ను మొహంపై వేళ్లతో అప్లై చేస్తూ మసాజ్ చేయాలన్నారు. ఫేస్ సీరమ్ చర్మానికి కావాల్సిన విటమిన్స్‌ను అందిస్తుందన్నారు.
తర్వాత సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయాలని తెలిపారు. తన మార్నింగ్ రోటిన్‌లో సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైనదని జెన్నీఫర్ చెప్పారు. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్యాన్ని ఇది కాపాడుతోందని ఆమె తెలిపారు. అలాగే, డార్క్ స్పాట్స్, ముడతలు రాకుండా సహాయపడుతోందని అన్నారు. ఇక చివరగా జెన్నీఫర్ తన మార్నింగ్ రోటిన్‌ను అండర్ ఐ క్రీమ్‌తో ముగించారు. ఇలా రోజు చేయటం ద్వారా మొహం అందంగా కనిపిస్తోందని అభిమానులతో పంచుకున్నారు.