ఢిల్లీ జె.ఎన్.యూ మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కన్హయ్యతో పాటు గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అయితే, సాంకేతిక కారణాలతో ఆయన పార్టీ కండువా కప్పుకోలేదు.
బీజేపీపై జె.ఎన్.యూ విద్యార్థి నేతగా కన్హయ్య పోరాటం చేశారు. దేశద్రోహం కేసులో జైలుపాలయ్యారు. ఆ తర్వాత సీపీఐలో చేరి తన స్వరాష్ట్రమైన బీహార్ లోని బెగుసరాయి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, మంచి వక్తగా తనకు గుర్తింపు ఉంది.
ఇటు జిగ్నేహ్ మేవానీ గుజరాత్ లోని వాద్గామ్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, కాంగ్రెస్ మాత్రం అక్కడ ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపలేదు.