ఢిల్లీలోని జె.ఎన్.యు లో విద్యార్ధులపై దాడికి బాధ్యత వహిస్తూ వైస్ ఛాన్స్ లర్ మామిడాల జగదీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని యూనివర్సిటీ విద్యార్ధి సంఘం డిమాండ్ చేస్తోంది. వైస్ ఛాన్స్ లర్ పిరికోడని..వెనక నుంచి చట్ట విరుద్ధ విధానాలు ప్రవేశపెడతారని విద్యార్ధి సంఘం విమర్శించింది. విద్యార్ధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయడని ఆరోపించింది. ప్రైవేటీకరణ నుంచి యూనివర్సిటీని రక్షించుకోవడానికి క్యాంపస్ లో విద్యార్ధులు 70 రోజులుగా నిరసన తెలుపుతున్నారని చెప్పారు. యూనివర్సిటీలో హింసను ప్రేరేపించడానికి తన తొత్తులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో విద్యార్ధులపై దాడికి బాధ్యత వహిస్తూ వీసీ రాజీనామా చేయాలని…లేదంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అతన్ని తొలగించాలని యూనివర్సిటీ విద్యార్ది సంఘం డిమాండ్ చేస్తోంది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం యూనివర్సిటీని ధ్వంసం చేయాలనే వారి ఆటలు సాగవని విద్యార్ధి సంఘం హెచ్చరించింది.