ఢిల్లీ జె.ఎన్.యు లో విద్యార్ధులపై దాడి ఘటనతో మనస్థాపం చెందిన ప్రొఫెసర్ కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ డేటా రివ్యూ ప్యానెల్ నుంచి వైదొలిగారు. జె.ఎన్.యు కు చెందిన ప్రొఫెసర్ సి.పి చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎకనామిక్ డేటా రివ్యూ ప్యానల్ లో సభ్యుడు. ప్యానెల్ మొదటి సమావేశం రేపు (బుధవారం) జరగనుంది. అయితే ఒక రోజు ముందుగానే ఆయన ఆ ప్యానెల్ నుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను సమర్పించారు. ” నేను పనిచేసే జె.ఎన్.యులో పరిస్థితి మీకు తెలియజేయడానికి నేను బాధపడుతున్నాను…రేపటి మీటింగ్ కు నేను రాలేకపోతున్నాను” అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జె.ఎన్.యు. ఘటన తీవ్రంగా కలచివేసింది. జె.ఎన్.యు విద్యార్ధులను జాతి విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రశేఖర్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.
తన రాజీనామ లేఖలో చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం ఎకానమీ, ఉద్యోగాలు, వినియోగదారుల ఖర్చులపై సర్వేలను నిలిపి వేసి వివాదస్పదమై విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇటీవల కప్పిపెట్టిన ప్రభుత్వ గణాంకాల నిజాయితీని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో బయటకు రాకుండా చేసిన గణాంకాల నిజాయితీని ప్రస్తుత కమిటీ పునరుద్ధరించలేదని నేను భావిస్తున్నాను. ఈ కమిటీలో ఉండి తమ ప్రయత్నాలను కొనసాగించే సహోద్యోగులకు అభినంధనలు…రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారి స్వతంత్రతకు విలువ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను పనిచేయలేను అని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisements
జనవరి 2019 లో నేషనల్ స్టాటి స్టికల్ కమిషన్ యాక్టింగ్ ఛైర్మన్ పి.సి.మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ప్రభుత్వ అధికారిక వివరాల క్వాలిటీని పరీక్షిస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల డేటాను సమర్పించనందుకు నిరసనగా ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయనతో పాటు మరో సభ్యురాలు జె.మీనాక్షి కూడా రాజీనామా చేశారు. జాబ్స్ డేటా బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్ కు లీక్ కావడంపై నిరసనగా రాజీనామా చేశారు. ఇండియాలో జాబ్స్ రేటింగ్ 2018 జూన్ వరకు 6.1 కు పెరిగి గత 45 ఏళ్లలో అత్యున్నత స్థాయికి పెరిగిందని బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్ పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చులు గత కొన్ని దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతగా భారీగా పడిపోయినట్టు నివేదికలు వచ్చాయి. దీంతో ఆ వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు 2017-18 సంవత్సరానికి సంబంధించి కన్స్యూమర్ ఎక్ష్‌పెండీచర్ సర్వే ను విడుదల చేయలేమని గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.