పలు విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇస్రో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో ఉన్న వేర్వురు అప్రెంటీస్ ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఇందుకు ఈనెల 21 చివరి తేదీగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ కాలంలో అప్రెంటీస్ అభ్యర్థులకు వేతనంగా రూ.7688 వరకు స్టైఫండ్ ను కూడా అందిస్తారని తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. పదో తరగతితో పాటు ఐటీఐలో సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. ఈ పోస్టులకు అప్లై చేసేవారికి వయస్సు పరిమితి కూడా విధించింది. 35సంవత్సరాలకు మించకూడదని పేర్కొన్నారు. అయితే బీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు ఉంటుందని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ : www.sac.gov.in ను సందర్శించవచ్చు.