ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకుగాను 312 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ విభాగం.
Advertisements
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్) ఉండాలని నిబందనను పోందుపర్చింది. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉండాలని సూచించింది. అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థుల వయసు 30.11.2019 నాటికి 18-24 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొంది. నిబందనల ప్రకారంగా వయస్సులో సడలింపు ఉంటుందని ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ విభాగం తెలిపింది. రాతపరీక్ష ఆధారంగా నియామకాలను చేపట్టనుంది.