ఉక్రెయిన్ పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. పుతిన్ ఓ నియంత అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిప్పులు చెరిగారు. సోవియట్ యూనియన్ ను పునరుద్దరించాలని పుతిన్ చూస్తున్నారని బైడెన్ అన్నారు.
అతనికి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం కన్నా ఎక్కువ ఆశయాలు ఉన్నాయి. ఆయన ఒకప్పటి సోవియట్ యూనియన్ ను ఆయన పునరుద్దరించాలని అనుకుంటున్నారు అని అన్నారు.
‘ నేను నమ్మిన ఏకైక విషయం ఏమిటంటే, మనం ఇప్పుడు ఆపకపోతే, పుతిన్ మరింత ధైర్యంగా ఉంటారు. మనం ఇప్పుడు ఈ ఆంక్షలతో అతన్ని కట్టడి చేయకపోతే పుతిన్ మరింత ధైర్యంగా ముందుకు వెళతారు ” అని బైడెన్ అన్నారు.
డాలర్ల, యూరో, పౌండ్లలో వ్యాపారం చేసే రష్యా సామర్ధ్యంపై మేము పరిమితులు విధిస్తాము. ఇందులో యెన్ కూడా చేరబోతోంది అని తెలిపారు. ఆర్థికంగా రష్యా ఎదిగే సామర్థ్యంపై, సైనిక శక్తిని పెంచుకునే సామర్థ్యాని మేము ఆపబోతున్నాము. 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థలో పోటీపడే వారి సామర్థ్యాన్ని మేము దెబ్బతీయబోతున్నాం” అని వెల్లడించారు.