అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి వివాదాలకు ఆద్యుడిగానే ఉంటూ వస్తున్నారు డోనాల్డ్ ట్రంప్. చివరికి వైట్‌హౌస్‌ను విడిచి వెళ్లే సమయం వచ్చినా.. ఆయన ప్రవర్తనలో పెద్దగా మార్పు రాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అనేక సమస్యలకు కారణమై అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అలాంటి ట్రంప్.. 150 ఏళ్ల ఓ సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారు.
కొత్తగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలపడం.. పాత అధ్యక్షుడికి ఆనవాయితీగా వస్తోంది. అయితే ట్రంప్ ఈ రూల్‌ను బ్రేక్ చేశారు. బైడెన్‌కు స్వాగతం చెప్పబోయేది లేదని ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగింది. 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్.. కొత్త అధ్యక్షుడి ఎస్ గ్రాంట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాత 150 ఏళ్లకు మళ్లీ అలా జరగుతోంది. కాగా ట్రంప్ ప్రకటనపై ఇప్పటికే బైడెన్ తీవ్రంగా స్పందించారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు.