అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమానం ఎక్కుతూ పట్టుతప్పి జారి పడ్డారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం లోకి ఎక్కుతుండగా బైడెన్ కాలు స్లిప్ అయింది. భద్రతా సిబ్బంది వచ్చే లోపే ఆయన లేచి లోపలికి వెళ్లారు.
ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు విమానం మెట్లు ఎక్కుతూ స్లిప్ అయ్యి పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడటం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయలుదేరిన సమయంలో కాలు జారి పడిపోయారు. ఆ తర్వాత 2022లో ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు.
అమెరికా సమ్మిట్ కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్ కు వెళ్లే ముందు అడుగులు వేస్తున్నప్పుడు జో బైడెన్ తడబడ్డారు. ఇక ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశమైన బైడెన్ కైవ్‌కు మద్దతు తెలిపారు.