పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదిలా ఉండగా కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ప్రభాస్ సలార్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడట ప్రశాంత్ నీల్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించబోతున్నారని తెలుస్తోంది. జాన్ అబ్రహం అయితేనే ప్రభాస్ కు సరిపోతాడని భావిస్తున్నాడట ప్రశాంత్. ఈ మేరకు త్వరలోనే ప్రశాంత్ నీల్ జాన్ ను కలవనున్నారని తెలుస్తోంది.