బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ భారత్ లో పర్యటించనున్నారు. వచ్చే వారం ఆయన భారత్ కు రానున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీతో భద్రతా, వాణిజ్యంపై ఆయన చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నట్టు చెప్పారు.

‘ ఏప్రిల్ 21-22న పర్యటనలో మన రెండు దేశాల ప్రజలకు ముఖ్యమైన అంశాలైన ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి నుండి, ఇంధన భద్రత, రక్షణ వరకు తాను గతంలో చెప్పిన అంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ అనిశ్చిత సమయాల్లో బ్రిటన్ కు భారత్ అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని ఆయన వెల్లడించారు.