అవెంజర్స్, అవతార్ లాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. హాలీవుడ్ మూవీకి ఇండియాలో ఉండే మార్కెట్ రేంజ్ ఎలాంటిదో చెప్పాయి. ముఖ్యంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇండియాలో 350కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాలన్నీ కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా ఇండియన్ లాంగ్వేజ్స్ అన్నింట్లో రిలీజ్ అయ్యాయి కాబట్టే అంత వసూళ్లు రాబట్టగలిగాయని కొంతమంది అభిప్రాయం.

ఇండియన్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన ఈ రెండు సినిమాల కన్నా రెండు దశాబ్దాల ముందే మన దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన మూవీ టైటానిక్. 1997లో వచ్చిన ఈ మూవీ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే రిలీజ్ అయ్యి అప్పట్లోనే 65కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పట్లో అయి ఉంటే ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండేది, ఏళ్లుగా గడుస్తున్నా ఎన్ని సినిమాలు వస్తున్నా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టైటానిక్ రికార్డు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు టైటానిక్ రికార్డులు తిరగరాయడానికి జోకర్ సినిమా రెడీ అయ్యింది. సైరా వార్ లాంటి సినిమా పోటీగా ఉన్నా 700 థియేటర్స్ లో రిలీజ్ అయిన జోకర్ సినిమాకి డబ్బింగ్ వెర్షన్స్ లేవు, ఇంగ్లీష్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. క్రిటికల్ అప్లాజ్ తెచ్చుకున్న జోకర్ సినిమా 23 రోజుల్లో 63 కోట్లు రాబట్టింది, ఇంకో రెండు కోట్లు రాబడితే టైటానిక్ సినిమా రికార్డులు గల్లంతయ్యినట్లే. దాదాపు ఈ వీక్ లోనే జోకర్ సినిమా టైటానిక్ ఇండియన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.