ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నేత
రాహుల్ గాంధీ టూర్ తో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ వచ్చింది. అంతేకాకుండా డిక్లరేషన్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్.. ఓ సారి ఛత్తీస్ ఘడ్ వెళ్ళు చూడు. అక్కడ రైతుల రుణమాఫీ.. ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయో చూసి రా. అడ్డగోలుగా మాట్లాడిన బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం ల చీకటి కోణం బయట పడింది.
ఎంఐఎం ఒక్క మాట కూడా అనలేదు. కానీ.. ఎంఐఎం మాత్రం రాహుల్ పై ఎందుకు విమర్శలు చేస్తుందో అర్ధం కావడంలేదు. ఎవరి కోసం ఎంఐఎం పని చేస్తుంది. ఎవరి మన్ననలు పొందడానికి రాహుల్ ను విమర్శిస్తోంది.
తమ విమర్శలు ఎవరికోసమో ఎంఐఎం సమాధానం చెప్పాలి. దాసుకో.. దోచుకో అనేదే టీఆర్‌ఎస్ విధానం. 2004 నుండి 2014 వరకు రాహుల్ కోరుకుంటే ప్రధాని అయ్యే వాడు. రాహుల్ కు ప్రజాసేవ కావాలి కానీ.. పదవుల పైన ఆశ, కోరికి లేదు.
కేటీఆర్ మాటలు విన్న రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారు. రాహుల్ దేశానికి కాబోయే ప్రధాని మాత్రమే కాదు.. కాబోయే ఏఐసీసీ అధ్యక్షుడు కూడా. టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.