ప్రభుత్వాలు మారటమే ఆలస్యం ఊళ్లకు, వీధులకు… ఇతర భవనాలకు పేర్లు మార్చేయటం అలవాటై పోయింది. మహానీయుల పేర్లు అని కూడా చూడకుండా స్వలాభం కోసం పేర్లు మార్చేశారు. కృష్ణా పత్రిక ఫౌండర్ ముట్నూరి కృష్ణారావు పేరున ఉన్న మచిలీపట్నంలోని టౌన్‌హాల్ పేరును విక్టోరియా మెమోరియల్ అండ్ పబ్లిక్ లైబ్రరీగా మార్చేశారు.
ముట్నారి కృష్ణారావు, పింగళి వెంకయ్య వంటి ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతంలో ఉండేవారు. వారందరినీ కాదని మతతత్వంతో పరదేశీయుల పేర్లు పెట్టం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో నడిచిన పత్రిక కృష్ణాపత్రిక అని గుర్తుచేస్తున్నారు.
కొన్ని దశాబ్ధాలుగా టౌన్‌హాల్ ఆయన పేరునే ఉంది. ఆ పేరును తీసే అధికారం మీకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు న్యాయవాది బూరగడ్డ అశోక్‌కుమార్. మన తెలుగు వాడు, మన భారతీయుని పేరు మార్చి వారి పేరు ఎందుకు పెట్టారు, ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులో కుట్ర ఉన్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు.