జర్నలిస్ట్ రఘు
హుజూర్‌నగర్ ఉపఎన్నికకు టిఆరెస్ పార్టీ గెలుపు కోసం కేసీఆర్ 70మంది ఇంచార్జిలను నియమించారు. కేవలం ఒక ఉప ఎన్నికకు ఇంత హడావిడి అవసరమా ? ఈ ఎన్నికలో టీఆరెస్ గెలిచినా, ఓడినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదు. ఎలాగూ తెలంగాణను బంగారు తునక చేయడం దాదాపుగా అయిపోయిందని మీరే చెప్తున్నారు. మరి అంత బాగా చేస్తే ఇంత హడావిడి రాజకీయం ఎందుకు ? ఒకవైపు తెలంగాణ అనారోగ్య తెలంగాణగా మారిపోయింది. డెంగీ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కనీసం దోమల బారి నుండి ప్రజలను రక్షించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, మీరు ఎన్నికల కసరత్తులో మునిగిపోయారు. ఒక ఉపఎన్నికకు కోసం 70మంది ఇంచార్జిలతో మీ బలగం ఎంతనో ప్రతిపక్షాలకు చూపిస్తున్నారు. ఇక ముందు మీ మంత్రులంతా రాష్ట్ర పరిపాలన వదిలేసి హుజుర్ నగర్ లో గల్లీ గల్లీ తిరగడం ఖాయం. మీకు ఎన్నికల ప్రచారం చేయడానికి సమయం ఉంది కానీ, ప్రజల ఆరోగ్యం మీద రివ్యూ చేయడానికి సమయం లేదు. ఇంకా ఎంత మంది ప్రాణాలు పోతే మీరు మేలుకుంటారు?