హైటెక్ సిటీ లోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ బలిపీఠం గా మారింది.పాలకుల పాపం సామాన్య ప్రజల ప్రాణాల పాలిట శాపంలా పరిణమించింది.ఒక ఫ్లై ఓవర్ పై జరిగే ప్రమాదాలకు పాలకులను బాధ్యులుగా చేయడం సమంజసమేనా అనే మీమాంస తీరాలంటే అక్కడ ఆ ఫ్లై ఓవర్ రావడానికి ముందు వెనక,చుట్టుపక్కల చరిత్రను పరిశీలించాలి.ఇక్కడ ప్రమాదాలు జరిగి జనాల ప్రాణాలు పోతున్న ప్రతీసారి ఆ నలుగురి అంతరాత్మలు గిల్టీగా ఫీలవుతుంటాయేమో…!? ఆ నలుగురు ఎవరంటే A1.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు A2. మై హోం రామేశ్వర రావు A3. మంత్రి హరీష్ రావు A4 మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు and others లో పాలకులకు నొప్పి కలగకుండా ఉండేందుకు ఆ ఫ్లై ఓవర్ ను ప్రాణాంతకంగా నిర్మించిన అధికారగణం.
మై హోం రామేశ్వర రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దాదాపు 30 అంతస్తుల “భుజ” ప్రాజెక్టు ముందే ఈ ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేశారు. దానికంటే “భుజ” ప్రాజెక్టు కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడానికే ఈ ఫ్లై ఓవర్ నిర్మించారని చెప్పుకోవడం కరెక్ట్.మై హోం ” భుజ” నిర్మాణమైన ఈ భూమిపై వివాదం ఉంది. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ భూమి ప్రభుత్వానిదిగా పేర్కొనడంతో మై హోం రామేశ్వర రావు అల్లల్లాడిపోయారు.వందల ఎకరాల లాండ్ బ్యాంక్ ఉన్న రామేశ్వర రావు ఈ భూమి విషయంలో తన శక్తియుక్తులు,అస్త్ర శస్త్రాలను సంధించారు.రామేశ్వర రావు స్వయంగా CM కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఆందోళనకు దిగారు. వెలమ కుల పెద్ద,TRS అధినేత KCR ఆదేశాలతో TRS ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దూకారు.ఈ పోరాటానికి (?) KTR ను దూరంగా ఉంచడంలో మతలబు KCR కే తెలుసు.తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న ఆ రోజుల్లో TDP, TRS సంబంధాలు ఉప్పు నిప్పు లా ఉండేవి.అప్పటి తెలంగాణ TDP సారథిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అయినప్పటికీ సొంత కులపోడికి అంతటి కష్టం రావడంతో తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకరరావు వెలమ కుల ప్రయోజనాల కోసం ధర్నా చేసి అరెస్టయ్యారు.ఆ నలుగురు వెలమల కష్టం వృధా పోలేదు.వృధా పోవడానికి వాళ్ళేమైనా దిక్కూ మొక్కూ లేని మల్లన్న సాగర్ రైతులు కాదు కదా…!? 1200 మంది అమరుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.ఆ శ్రీమన్నారాయణుడి దయతో 30 అంతస్తులతో మై హోం “భుజ” ప్రాజెక్టు కూడా పూర్తయింది. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది.”భుజ” ప్రాంతంలో తలనొప్పి లా మారిన ట్రాఫిక్ సమస్య సేల్స్ ను డిస్టర్బ్ చేసేలా ఉండడంతో KCR సర్కార్ కంగారు పడిపోయింది. కట్ చేస్తే ఆగమేఘాల మీద ఫ్లై ఓవర్ పూర్తయిపోయింది.”భుజ” ప్రయోజనాలకు అనుగుణంగా వేయాల్సిన పరిమితుల్లో అధికారులు ఈ ఫ్లై ఓవర్ ను అడ్డదిడ్డంగా పూర్తి చేశారనే విమర్శలున్నాయి.అధికారులు ఇదే స్పీడ్ ను అన్ని చోట్లా చూపిస్తే ఈపాటికే రాష్ట్రమంతటా డబుల్ బెడ్ రూం ఇళ్ళు పూర్తయిపోయేవి.జర్నలిస్టుల గృహప్రవేశాలు కూడా జరిగిపోయేవి.
భూ నిర్వాసిత రైతులు,ఇంటర్ విద్యార్థులు,RTC కార్మికులు పిట్టల్లా రాలినా కనీస కనికరం లేకుండా వ్యవహరించిన KCR ప్లై ఓవర్ ప్రమాద మృతుల విషయంలో ఎనలేని ఔదార్యాన్ని చూపారు.ఆ నలుగురు వెలమల అంతరాత్మలు గిల్టీగా ఫీలయినందుకో దేనికో తెలీదు కానీ తొలిసారిగా ఫ్లై ఓవర్ ప్రమాద మృతులకు అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఇది ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రకటిస్తే ఇంతకు ముందు ఫ్లై ఓవర్ ప్రమాద మృతులకు కూడా అందాలి కదా…!? అలా కాకుండా “భుజ” బలి స్కీమ్ లో భాగంగా ఇస్తే మాత్రం ఆ నలుగురు వెలమల మానవీయ స్పందన నిజంగా ఆదర్శప్రాయం.
సతీష్ కమాల్
సాధారణ జర్నలిస్ట్