ఇకనైనా కళ్ళు తెరువు కేసీఆర్ - Tolivelugu

ఇకనైనా కళ్ళు తెరువు కేసీఆర్

 సతీష్ కమల్, సీనియర్ జర్నలిస్ట్

 

Mr Chief Minister మీ అసమర్థ పాలన వికృత,విషాద ఫలితమే MRO విజయరెడ్డి హత్య.

వ్యవస్థల్ని నిలువునా ధ్వంసం చేసిన పర్యవసానమే మహిళా MRO సజీవ దహనం.

ముఖ్యమంత్రిగా మీరు ప్రజల అందుబాటులో ఉండి ఉంటే మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

మీ ముఖ్యమంత్రి కార్యాలయం అయినా ప్రజల గోడును కనీసం వినడానికి అవకాశం ఉన్నా మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

హీనపక్షంలో అవినీతికి వ్యతిరేకంగా మీరు స్వయంగా ప్రజల ముందు బహిరంగ సభలో ప్రకటించిన మీ కార్యాలయ ఫోన్ నంబర్ పనిచేసినా మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

మీరొక రహస్య ఎజెండాతో రెవెన్యూ ఉద్యోగులు, అధికారులను టార్గెట్ చేయకపోయి ఉంటే మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

పోలీసు శాఖను TRS పాలేర్ల బృందంగా మార్చకుండా ఉండి ఉంటే మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

“తిను-తినిపించు-లైఫ్ అందించు” అనే మీ ఎజెండా అన్ని రకాల విలువల్ని,సకల వ్యవస్థలను తుంగలో తొక్కి…పాతాళంలో పాతేయకపోయి ఉంటే మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

ప్రభుత్వం ఎలా ఉంది ? పాలన ఎలా నడుస్తోంది ? ప్రజలకు అందుబాటులో ఉన్నామా ? అని మీ మంత్రులు కనీస జవాబుదారీతనంతో ఆలోచించినా మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

ఈ ఎన్నికల ఖర్చుని ఎలా రికవర్ చేసుకోవాలి…వచ్చే ఎన్నికల కోసం ఎంత దోచుకోవాలి…తరాల తరబడి తిన్నా తరగని సంపదను ఎలా దాచుకోవాలని మీ TRS ప్రజాప్రతినిధులు దిగజారకపోయి ఉంటే మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

మీ రాజకీయ వారసుడు,షాడో ఛీఫ్ మినిస్టర్ కూడా మీ ప్రభావంతో ప్రజల్లోకి వెళ్ళాల్సిన సమయంలో…ట్విట్టర్ కూతలకే పరిమితమవకుండా ఉండి ఉంటే
మహిళా MRO సజీవ దహనం జరగకపోయి ఉండేది.

నందమూరి హరికృష్ణ చనిపోయాడని పరుగులు పెడ్తూ వెళ్ళి పరామర్శించిన మీరు…మీ ప్రభుత్వ యంత్రాంగంలోని ఒక మహిళను ప్రభుత్వ కార్యాలయం లోనే సజీవంగా కాల్చి చంపినా నిమ్మకు నీరెత్తినట్టు అధికార మత్తులో ప్రగతిభవన్ లోనే పడుకుంటే ఈ ప్రభుత్వం ఇంకేమీ ముందుకు పడ్తది…? మీ వ్యవహారశైలి గురించి ఏ ఒక్క రోజైనా…ఏ ఒక్క క్షణమైనా మీ అంతరాత్మ మిమ్మల్ని సిగ్గు పడమని చెప్పలేదా…?

ఇప్పటికైనా కళ్ళు తెరవండి…అధికారమత్తును వీడండి…దురహంకార వైఖరిని ‌మార్చుకోండి…లేదంటే చరిత్రలో ఒక తుఛ్ఛ ముఖ్యమంత్రి గా మిగిలిపోవడం ఖాయం.

Share on facebook
Share on twitter
Share on whatsapp