తల్లి తహసీల్దార్ - యెంత తల్లడిల్లిందో!! - Tolivelugu

తల్లి తహసీల్దార్ – యెంత తల్లడిల్లిందో!!

తీస్మార్ ఖాన్ శివన్న, జర్నలిస్టు

” తల్లి తహసీల్దార్ – యెంత తల్లడిల్లిందో ఆడివిల్ల ఆడోల్లు అని సూడకుండ పట్టపగలు పెట్రోలు వోసి అగ్గoటిచ్చుడు యెంత గోరం యెంత అమానుషం..ఆ తల్లి యెంత తండ్లాడిందో యెంత గిల గిలా గొట్టుకుందో పాపం. తుత్ ఒక గౌర్మెంటంటే బయం లేదు..ఆపీసర్లంటే బయం లేదు.. పోలీసోల్లంటే గూడ అస్సల్ బయం లేకుండవోయింది లుచ్ఛానాయాల్లకు ఇట్లైతే వోల్లని జూత్తె బయం బుట్టాలె తప్పు జేశే శేత్తనాయాళ్లకు, ఆపీసర్లదెదన్న తప్పుంటే పెద్దాపీసర్ల దగ్గరికి ఓపికతోని గొండవోవాలె,నిలదీయాలె గని గిట్ల జేత్తరా..యెటు వోతున్నది మన తెలంగాణ, మన సంస్కృతి,సంప్రదాయం, సంస్కారం, ఆడోల్లంటే యెంత గౌరవం, పెద్దమన్సులంటే యెంత భయం భక్తి, సంఘం సమాజమంటే గౌరవం, యాడికి వోయినయ్, యాడ గానస్తున్నయ్, ఇగ రాన్రాను ఏం గానచ్చేటట్టు లేదు. యేo గోరాలో యేమో అందరి ధమాక్ ఖరాబైపోతుంది..ఆ తల్లి ఆత్మకు శాంతి,ఆ తల్లి కుటింబంకు మనోబలం, ఆత్మస్దైర్యం ఇయ్యాలని ఆ దేవున్ని గోరుతూ నా ప్రగాడ సానుభూతిని వ్యక్తం జేస్తున్న.

తీస్మార్ ఖాన్ శివన్న జర్నలిస్టు,యాంకర్,ఎంపి డిఫిటెడ్,నిజామాబాద్,బోధన్…

Share on facebook
Share on twitter
Share on whatsapp