వార్తల కవరేజికి వెళ్లిన జర్నలిస్టుపై భూ కబ్జాదారులు దాడి చేసిన ఘటన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మల్లంపేట్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే….
మల్లంపేట్ లోని సర్వే నంబర్ 170లో లవణి పట్టా పట్టా భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చి వేస్తున్నట్టు ప్రముఖ టీవీ ఛానల్ లో పని చేస్తున్న ఓ జర్నలిస్టుకు ఆ గ్రామ వీఆర్ఏ సమాచారం అందించారు.
దీంతో వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై అప్పటికే అక్కడ మకాం వేసిన కొందరు దాడికి దిగారు. తర్వాత అతని మొబైల్ ఫోన్ ను లాక్కొని అందులోని ఫోటోలు, వీడియోలు డిలీట్ చేశారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సదరు జర్నలిస్టును వారు బెదిరింపులకు గురి చేశారు. అనంతరం జర్నలిస్టుపై గ్రానైట్ రాయితో వీఆర్ఏ దాడికి దిగారు.
ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి ఆ జర్నలిస్టు పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.