ఇప్పుడు మీడియాలో రాత గాళ్లు తగ్గారు మోత గాల్లు ఎక్కువ అయ్యారు అనిపిస్తుంది. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లు పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్ళిన వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన నాయకుడికి ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తారు, వారిని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేస్తారు, తద్వారా వారిలో అంతర్గతంగా ఏమి దాగివుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. పెద్ద నాయకులైన ముఖ్యమంత్రి. మంత్రులు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వెళ్ళే రిపోర్టర్స్ లో కొద్ది మంది వారికి అనుకూలమైన ప్రశ్నలు వేయడం, ఎవరైన ముఖ్యమంత్రి లేదా మంత్రులను ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తే దానిని డైవర్ట్ చేయడం చేస్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు సహ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడం తద్వారా మన్ననలు పొందడం దాని ద్వారా వ్యక్తిగత ప్రయోజనాలు పొందడం జరుగుతుంది.
ఇది జర్నలిస్టు విలువలను దిగజారచడమే అంటున్నారు సీనియర్ పాత్రికేయులు. తమ టైంలో ఈ ట్రెండ్ లేదని ప్రెస్ మీట్ కు వచ్చిన రిపోర్టర్స్ ఒకరికి ఒకరు పోటీపడి ప్రశ్నలు వేసి విషయాలు రాబట్టే ప్రయత్నం చేసేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటే ముఖ్యమంత్రి పి ఆర్ ఓ లు కొంత మంది రిపోర్టర్ లకు ప్రశ్నలు రాసివ్వడం, వాటిని అడగమని చెప్పడం ఎవరైనా సీఎంను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తే దానిని డైవర్ట్ చేయాలని చెప్పడం చేస్తున్నారు. అది అందరికీ అర్థం అవుతుంది. ఇటీవల చాలా సందర్భాల్లో ఇది బయటపడింది కూడా. అందుకే ఇప్పుడు రాత గాళ్ళు తగ్గి… మోత గాళ్ళు ఎక్కువైనారు అంటున్నారు. మోత గాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కే పరిమితం కాకుండా ఏ రిపోర్టర్ ఏమి మాట్లాడుతున్నాడో, ప్రభుత్వం గురించి ఏమి కామెంట్స్ చేస్తున్నాడో మంత్రుల గురించి ఏమి కామెంట్స్ చేస్తున్నాడో, వారికి చేరవేయటం కూడా చేస్తున్నారు.
అంటే ఇక్కడ వార్త అక్కడికి, అక్కడి వార్త ఇక్కడికి మోయడం చేస్తున్నారు. అంతే కాదు కాంగ్రెస్ నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లి ఆ ప్రెస్ మీట్ లో కూర్చుని వెంటనే అక్కడ నాయకులు చెప్పిన విషయాలు ఇతర పార్టీ నాయకులకు చేరవేయడం పరిపాటిగా మారింది అంటున్నారు సీనీయర్స్. ఇది జర్నలిస్టు సమాజానికి మంచిది కాదని, మన విలువలను మనమే దిగజార్చుకోవడం అంటున్నారు. ఈ కల్చర్ మీడియా హౌజ్ లకు కూడా పాకింది అంటున్నారు. వార్తలు మోసి బతికే కొంత మంది… వార్తలు రాసే వారిని ఇబ్బంది పెడుతున్నారని, తమ బాస్ లకు వార్తలు మోసి శబాష్ అనిపించుకున్నారు. ఎక్కడ మా మీద చాడీలు చెప్తాడో అని బయపడి చస్తున్నారు ఒక ప్రముఖ ఛానెల్. ఇటీవల కాలం దాకా ప్రోబిషనల్ ఛానెల్ గా నడిచి, ఇప్పుడు పారిశ్రామివేత్తల చేతిలోకి వెళ్ళగానే అప్పటి దాకా రాత గాళ్లకే అవకాశం ఉన్న ఆ ఛానెల్ లో నమస్తే మోత గాల్లకు అవకాశం వచ్చింది. దీంతో రాత గాళ్ళకు కష్టాలు మొదలైనాయి. మోత గాళ్ళు మరింత రెచ్చిపోతూ ఫలనా రిపోర్టర్ ఫలాన సబ్ ఎడిటర్ మన పాత సీఈఓని కలిశారు మీ గురించి ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు. అని చెప్పి మార్కులు కొట్టేసి బతుకుతున్నారు. నిత్యం అభద్రతా బావంలో ఉంటూ కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఛానెల్ ఇంఛార్జి ఇంకొద్దిగా వారిని ప్రోత్సహిస్తునాడు. ఇది అన్ని చానల్స్ లో అన్ని బీట్స్ లో ప్రవేశించింది. మోత గాల్లని నమ్ముకుంటే అది ముఖ్యమంత్రి అయినా మంత్రులు అయినా ఇతర రాజకీయ నాయకులు అయినా లేదు ఛానల్ బాస్ లు అయినా నట్టేటా మునగడం ఖాయం. కాపోతే ఇప్పుడు మోత గాళ్ళ దే నడుస్తుంది అంటున్నారు నిజాయితీ పరులు. వార్తలు నీతిగా నిజాయితీగా రాసే వారికి విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువకాలం సాగదని… ప్రతి దానికి ఒ టైం వస్తుందని స్పష్టం చేస్తున్నారు.