నిజామాబాద్ కోరుట్ల పట్టణంలో జర్నలిస్ట్ లు నిరసనకు దిగారు. జిల్లా లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న పోశెట్టి పై దాడికి నిరసనగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తున్న ప్రెస్ వ్యవస్థలను ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించడంను సహించేది లేదన్నారు.
Advertisements
మాక్లూర్ జర్నలిస్ట్ పోశెట్టి పై దాడికి దిగిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు.