టీవీ9 వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అక్రమ అరెస్టుపై జర్నలిస్టులు నిరసన తెలియజేస్తున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా కేంద్రాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఏపీలో ఒకే ఒక ఛానల్ నడుస్తోంది. రెండు, మూడు సంస్థలు మినహా వీటన్నింటినీ దాదాపుగా అధికార పార్టీలకి సంబంధించిన మనుషులే నడుపుతున్నారు.
రవిప్రకాశ్ అనే మాట కూడా ఆయా సంస్థల కార్యాలయాల్లో వినిపించకుండా యాజమాన్యాలు కన్నెర్ర చేస్తున్నాయని ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులే చెబుతున్నారు. కాకపోతే, బయటికొచ్చి రవిప్రకాశ్‌కు మద్దతు తెలియజేయడానికి తమకు ఉద్యోగ భయం వుందని అంటున్నారు. తమ జీవితాలు ఇవాళ ఈ స్థాయిలో వున్నాయంటే అదంతా రవిప్రకాశ్ పుణ్యమే అని మీడియా రంగంలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా ఒప్పుకుంటాడు.
రవిప్రకాశ్ టీవీ9 తీసుకురావడానికి ముందు అరకొర జీతాలతో జర్నలిస్టుల జీవితాలు దయనీయంగా వుండేవి. మీడియాలో పనిచేసే ఉద్యోగులు సమాజంలో ఉన్నతంగా, హుందాగా బతకాలనే ధ్యేయంతో రవిప్రకాశ్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంస్థ ప్రారంభం నుంచి సంస్థ నుంచి బయటికి వెళ్లిపోయే రోజు వరకు ఆకర్షణీయమైన జీతాలు అందించేవారు. దానికోసం యాజమాన్యంతో స్పర్ధలు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇవాళ టీవీ9లో పనిచేసే జర్నలిస్టులు ఖరీదైన కార్లు, సంపన్నులు వుండే ఆవాసాల మధ్య ఇళ్లు, ఫ్లాట్లు తీసుకుని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారంటే అదంతా రవిప్రకాశ్ చొరవ వల్లే.
మీడియా అధికార పార్టీ చేతుల్లోకి వెళ్లిపోతుంటే జరిగే నష్టం ఏంటో తొలి నుంచి రవిప్రకాశ్ చెబుతూనే వున్నారు. ఇంత పెద్ద ఆర్టీసీ సమ్మె జరుగుతూ వుంటే, 50 వేల మంది సిబ్బంది ఉద్యోగాల్ని ఊడబీకుతానని సీయం ఓపెన్‌గా చెబుతూ వుంటే ఒక్క మీడియా సంస్థ కూడా ఈ వార్తని రాయలేని దుస్థితి వుందని ఆర్టీజీ కార్మికులే విమర్శిస్తున్నారు.