బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, ఆఫీసులు కాదని ఆయన తెలిపారు. బిహార్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..
ఇతర పార్టీలకు ఆఫీసులు ఉన్నాయని, కానీ తమ పార్టీకి మాత్రం కార్యాలయాలు ఉన్నాయని విపక్షాలకు చురకలు అంటించారు. అన్ని పార్టీల ఆఫీసుల్లాగా బీజేపీ కార్యాలయాలు మూత పడవు అని ఆయన అన్నారు. ప్రజాసంక్షేమం కోసం తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
ప్రజాసమస్యలను వినేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. అందుకే తాము ఎప్పుడూ బీజేపీ ఆఫీసు అంటూ సంభోదించబోమన్నారు. తాము ఎల్లప్పుడు వాటిని కార్యాలయాలయాలుగానే పిలుస్తామన్నారు. ఆఫీసులు ఉదయం 10గంటలకు తెరుచుకుని సాయంత్రానికి మూతపడతాయన్నారు.
కానీ తమ కార్యాలయాలు అలా కాదన్నారు. తమ కార్యాయాలు మన భావజాలానికి సజీవ రూపమని ఆయన వివరించారు. ఇతర పార్టీల్లో 20-30 ఏళ్లకు పైగా పనిచేసిన చాలా మంది నేతలు అన్నీ వదిలేసి బీజేపీలో ఎందుకు చేరుతున్నారు?అని ప్రశ్నించారు. ఎందుకంటే దేశంలో మార్పు అనేది బీజేపీ ద్వారానే సాధ్యమని వారి అందరికీ తెలుసని అన్నారు.