కాంగ్రెస్ పై జేపీ నడ్డా విమర్శలు…
1984 నాటి సిక్కుల ఊచకోతను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకుల హస్తాలు సిక్కుల రక్తంతో తడిశాయని అన్నారు. పంజాబ్ లోని బాలాచౌర్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో శనివారం ఆయన పాల్గొన్ని మాట్లాడారు.
‘1984 అల్లర్ల ద్వారా మానవత్వాన్ని కాంగ్రెస్ నేతలు అవమానించారు. కాంగ్రెస్ నేతల హస్తాలు రక్తంతో తడిసిపోయాయి. అప్పటి అల్లర్ల బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. సిక్కులకు ఊచకోతకు కారణమైన ఆ నాయకులే ఇప్పుడు ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారు” అన్నారు.
‘ ప్రధాన మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ.. ఇండియాలో లంగర్ ను ట్యాక్స్ ఫ్రీగా ప్రధాని చేశారు. ప్రధాని కృషి వల్లే కర్తార్ పూర్ కారిడార్ సాధ్యమైంది. కారిడార్ నిర్మాణం కోసం రూ. 120 కోట్లు ప్రధాని ఖర్చు చేశారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్దిని గతంలో ఏ ప్రధానీ చేయలేకపోయారు” అని తెలిపారు.
‘ 2014లో 18 లక్షల స్కాలర్ షిప్ లు ఇచ్చారు. కానీ ప్రధాని మోడీ వచ్చాక వాటిని 31 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో 1,517 నూతన పాఠశాలలను నిర్మించాము. 6 నవోదయ విద్యాలయాలను నిర్మించాము. ఇలాంటివి ఇంకా ఎన్నో అభివృద్ధి పనుల చేశాము. ఒక అవకాశం ఇస్తే పంజాబ్ ను హర్యానా మాదిరిగా అభివృద్ది చేస్తాము” అన్నారు.