బీజేపీ సాధిస్తున్న విజయాలను, లభిస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ సర్కారుకు పిచ్చెక్కిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై నడ్డా మండిపడ్డారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన కేసీఆర్ పై ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. బీజేపీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ సర్కారుకు పిచ్చెక్కిందన్నారు. పోలీసుల చర్యను కూడా ఆయన తప్పుబట్టారు.
అక్రమ కేసులకు భయపడబోమని, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోవిడ్ ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ సంజయ్‌పై కేసులు పెట్టారు. సంజయ్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సంజయ్ తో పాటు మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా ఐదుగురు తప్ప మిగిలిన వారు పరారీలో ఉన్నారు.