టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో దేశంలోని 55 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోంటే.. దాన్ని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నష్టం చేకూరుస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భూమి పూజ సందర్భంగా.. ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంతా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు
టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు నడ్డా. ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి.. 50 వేలకు మించి టీఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారని నడ్డా మండిపడ్డారు