బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తరువాత రోడ్డు మార్గాన సంగారెడ్డికి బయలుదేరుతారు. అక్కడ బీజేపీ కొత్త ఆఫీస్ ను ప్రారంభిస్తారు.
తరువాత అక్కడి నుంచే వర్చువల్ గా భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల పార్టీ ఆఫీస్ లను కూడా ఓపెన్ చేస్తారు. తెలంగాణలోని మొత్తం 5 జిల్లాల్లో పార్టీ ఆఫీసులతో పాటు ఏపీలో కూడా అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జనగామ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్ జిల్లాలో గరికపాటి మోహన్ రావు, రవీంద్ర నాయక్.. వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
నడ్డా రాక సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, ఆందోల్ నుంచి 20 వేలకు పైగా కార్యకర్తలు, నాయకులతో పాటు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. దీని తరువాత నడ్డా రిటర్న్ జర్నీ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్పుడు కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో భేటీ కానున్నారు.
ఈ భేటీలో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లు పాల్గొంటారు. తెలంగాణ తాజా రాజకీయాలపై సమీక్షతో పాటు.. ఎన్నికల సంసిద్ధతపై నడ్డా ఈ సమావేశంలో కీలక సూచనలు చేయనున్నారు.
పూర్తి కథనం..