బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 4న హైదరాబాద్ కి రానున్నారు. రాష్ట్ర బీజేపీ ఆయనకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆయన పాల్గోనున్నారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో స్థానికి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ వర్గాలకు దిశానిర్థేశం చేస్తారు.
ఆర్ఎస్ఎస్ సమావేశాలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.