నందమూరి తారకరత్న ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తారకరత్న పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు. అయితే తాజాగా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారకరత్న హెల్త్ కండిషన్ గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఏదైనా హెల్త్ అప్ డేట్ ఇస్తారని అందరు ఆశించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. అసలు తారకరత్న గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
బెంగళూరులో చికిత్స తీసుకొంటున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి వారిద్దరూ మాట్లాడకపోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. అయిదే ఇందుకు కారణం కూడా లేకపోలేదు.
ఈ ఇద్దరు అమిగోస్ మూవీ కంటే తారకరత్న హెల్త్ గురించి చర్చ జరిగితే.. సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు తారకరత్న ఆరోగ్య విషయంలో పెద్దగా మార్పు లేదని, అందుకే ఈ హీరోలు మాట్లాడలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘అమిగోస్’ వంటి బడా సినిమా వేడుకలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఈ నందమూరి సోదరులు క్లారిటీ ఇస్తే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక అమిగోస్ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రాజేంద్ర రెడ్డి రచన దర్శకత్వం వహించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 2023లో వస్తోన్న మూడో చిత్రం ఇది. అమిగోస్ లో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం చూపించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయి’ రీమిక్స్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.