దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే చరణ్ సరసన బలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.
అయితే ఈరోజు ఒలివియా మోరీస్ పుట్టినరోజు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే యంగ్ ఎన్టీఆర్ కూడా ఒలీవియా మోరిస్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీబర్త్ డే డియర్ జెన్నిఫర్ అంటూ ట్వీట్ చేశారు.
Happy Birthday dear #Jennifer !!! @OliviaMorris891 #RRRMovie #RRR https://t.co/9q7cYVHMSb
— Jr NTR (@tarak9999) January 29, 2021