సౌత్ లో బయోపిక్ ల హవా నడుస్తుంది. మొదట సీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా వచ్చిన సినిమా మహానటి. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుని మంచి టాక్ తెచ్చుకుంది. తరువాత బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఆ సినిమా కూడా కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ వస్తుంది. ఈ సినిమాలో ఎంజీఆర్ గా అరవింద్ స్వామి, కరుణానిది గా ప్రకాష్ రాజు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. అటు సినిమాల్లో కానీ, రాజకీయంగా జయలలిత, ఎన్టీఆర్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయని ఇండస్ట్రీవర్గాలు చెప్తుంటాయి. అయితే ఆ పాత్రకు ఎన్టీఆర్ అయితే బాగుంటుందని జయలలిత బయోపిక్ టీమ్ ఎన్టీఆర్ ను సంప్రదించిందట. ఎన్టీఆర్ కూడా ఆ పాత్ర చెయ్యటానికి సిద్ధంగా ఉన్నరాని తెలుస్తుంది.