యంగ్ టైగర్ ఎన్టీయార్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. గతంలో మా టీవీ నిర్వహించిన బిగ్బాస్ సీజన్- 1కు హోస్ట్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేసిన ఎన్టీఆర్.. మరో సరికొత్త రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. జెమినీ టీవీ ప్లాన్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్‌గా అలరించబోతున్నాడు. తాజాగా జెమినీ టీవీ బిగ్గెస్ట్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఓ ప్రోమో విడుదల చేసింది. అయితే హోస్ట్ సీట్‌ని షాడోగా చూపించి.. ప్రేక్షకులు గెస్‌కు వదిలేసింది. అయితే దాదాపు వ్యూయర్స్ అందరూ ఎన్టీఆర్ అని తేల్చేశారు.
అటు ఇటీవలే ఎన్టీఆర్ కొన్ని ప్రోమో షూటింగుల్లో పాల్గొన్నాడని, త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడని ప్రచారం జరిగింది. అవి ఇవేనని తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రోమోలు ఒక్కొక్కటిగా రిలీజ్ కాబోతున్నాయి. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో మాటీవీ.. నాగార్జున అలాగే చిరంజీవిని హోస్ట్‌గా ప్రోగ్రామ్ చేసింది. దానికి మంచి ఆదరణ దక్కింది. దీంతో ఇప్పుడు అదే ప్రోగ్రామ్‌ణు ఎవరు మీలో కోటీశ్వరుడుగా మార్చి జెమినీ టీవి అదృష్టాన్నీ పరీక్షించుకుంటోంది. కాగా ఈ కార్యక్రమం కోసం ఎన్టీయార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.