నందమూరి యువ నటుడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్ళిన తారకరత్న గుండెపోటుకి గురయ్యాడు. ఆ తర్వాత అతనికి పెద్ద ఎత్తున చికిత్స చేసినా సరే లాభం లేకపోయింది. బెంగళూరులో కూడా విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసారు. అయితే చికిత్సకు తారకరత్న స్పందించకపోవడంతో మొన్న మధ్యాహ్నం అతని ఆరోగ్యం అత్యంత విషమం అని తెలిసింది.
నిన్న సాయంత్రం తారకరత్న మరణించాడు అని వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించి నిన్న నివాసంలో ఉంచారు. ఆ తర్వాత ఈ రోజు ఫిలిం చాంబర్ కు తరలించారు. ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని… నందమూరి కుటుంబంలోని కొందరు వ్యక్తులతో తారకరత్న సన్నిహిత సంబంధాలు తెలుస్తున్నాయి.
అలేఖ్యను వివాహం చేసుకున్న తర్వాత ఆయన్ను కుటుంబం దూరం పెట్టింది. ఆ తర్వాత కొందరితో మాత్రమే తారకరత్న మాట్లాడినట్టు సమాచారం. అందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని అంటున్నారు. తారకరత్నకు ఆర్ధిక కష్టాలు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ నెలకు నాలుగు లక్షల వరకు ఆర్ధిక సాయం చేసినట్టు తారకరత్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి నాకు మధ్య మంచి అనుబంధం ఉందని.. మేము బ్రదర్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటామని కూడా చెప్పాడు.