టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాలకృష్ణ తరువాత నందమూరి ఫ్యామిలీ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. టెంపర్ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ టైగర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన హీరోలు అప్పుడప్పుడూ ఫ్యామిలీ టైమ్ కూడా ఇస్తుంటారు. అయితే మే 5న ఎన్టీఆర్ పెళ్లి రోజు. ప్రతి ఏడాది కూడా మే 5న టైమ్ అంతా భార్య తన కొడుకులకు సమయాన్ని పూర్తిగా కేటాయిస్తుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన పెళ్లిరోజు తన కుటుంబంతో ఉండే ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి తన ఫ్యామిలీతోనే గడుపుతున్న విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి తో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ విధించారు. దాంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఇంటి వద్దే ఉంటూ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో ఉన్న ఎన్టీఆర్ హాయిగా తన మ్యారేజ్ డేను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈయన అభిమానులు కూడా సోషల్ మీడియాను విషెస్‌తో నింపేస్తున్నారు.