తెలుగు మూవీ మాంత్రికుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్.లో అన్నీ విశేషాలే..! రాంచరణ్ … జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్.. అల్లూరి.. కొమురం కథా నేపధ్యం…వెరీ ఇంట్రెస్టింగ్..!!
ఈ మూవీ పుణ్యమా అని జూనియర్ ఎన్టీఆర్ బహుభాషా కోవిదుడిగా మారిపోతున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పండితులతో పాఠాలు చెప్పించుకుంటున్నాడు. అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్‌ని ఫాలో అవుతున్నాడు. యన్టీఆర్ అప్పట్లో పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి భాష పెద్ద సమస్యగా మారితే.. హిందీ ట్యూటర్‌ని పెట్టుకుని నెలరోజుల్లో అత్యద్భుతంగా రాజభాష మాట్లాడ్డం మొదలెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇన్నిభాషలూ నేర్చేసుకుని ఆ భాషల్లో కూడా మూవీలు చేస్తాడేమో.. ఇక, రాంచరణ్ కూడా ఇదే రూటులో ట్రై చేస్తాడా..? లేదా..? అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.
ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఇద్దరు హీరోల ఎంట్రీ సీన్స్ భారీ వండర్స్ అని టాక్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్. నేషనల్ లెవల్ క్రేజీ ప్రాజెక్ట్.