యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అయినను పోయి రావలె అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సామెత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్‌ని తీసుకోవాలని ఈ మేర సంప్రదింపులు కూడా జరిపారట. జాహ్నవి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని సమాచారం. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, దాని కోసం తెలుగు హీరోయిన్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు వినికిడి.