నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించటంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను సాధించింది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. దానికోసం ఓ కథను కూడా రెడీ చేయిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కథ రెడీ చెయ్యిస్తుండటంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నిర్మాణంలోనే సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ లో మాట్లాడుకుంటున్నారు.