యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా RRR . రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో అందరి ద్రుష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా నటిస్తుంది. ప్రస్తుతానికి రాంచరణ్, అలియాభట్ ల మధ్య సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ఇప్పుడు ఎన్టీఆర్, ఒలీవియా మధ్య సన్నీ వేషాలను చిత్రీకరించనున్నారు.
అయితే RRR సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీయాలనే ఆలోచనలో పడ్డాడట.
ఫిబ్రవరి నాటికీ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథలకు ఎన్టీఆర్ ఒకే చెప్పాడని సమాచారం. అయితే RRR సినిమా రిలీజ్ అయ్యాక మొదట త్రివిక్రమ్ తోనే సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. అరవింద సమేత సినిమా తో త్రివిక్రమ్ మంచి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే RRR సినిమా నుంచి బయటకు వచ్చేవరకు మరో సినిమాని పట్టాలెక్కించి ఆలోచనలో ఎన్టీఆర్ లేడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.