యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2020లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదేంటి ఇంకా RRRసినిమా రిలీజ్ కాలేదు. నెక్స్ట్ సినిమా ప్రారంభం కూడా అవ్వలేదు రెండో సినిమా ఎవరితో అనేది కూడా చెప్పలేదు… రెండు సినిమాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారా..! అయితే మనకి ఒక సినిమానే కానీ తమిళ్ ప్రేక్షకులకు మాత్రం రెండు. అది ఎలా అనుకుంటున్నారా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2007 లో వచ్చిన సినిమా యమదొంగ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఇప్పుడు ఈ సినిమాని తమిళ్ లో విజయన్ పేరుతో అనువాదం చేస్తున్నారు. దీనికి అనువాద రచయితగా ఏఆర్‌కే.రాజా పనిచేశారు.
అప్పటికే అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విజయన్ చిత్రాన్ని శ్రీ మనీశ్వర మూవీస్ సంస్థ విడుదల హక్కులను పొంది జనవరి 3న తెరపైకి తీసుకరావడానికి సన్నాహాలు చేస్తోంది. మరో వైపు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రాంచరణ్ కలిసి RRR సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై ౩౦న ప్రేక్షకుల ముందు రానుంది.