RRR లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో తెలుసా ? - Tolivelugu

RRR లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో తెలుసా ?

రాజమౌళి…ఈ పేరు చెప్తే ఎలాంటి హీరోలైన ఆయనతో సినిమా చెయ్యటానికి ఒకే చెప్పేస్తారు. ఎందుకంటే రాజమౌళి అంటే అంత నమ్మకం. మాములుగా రాజమౌళి తన సినిమాల్లో హీరోని బాగా చూపిస్తారు. ఉదాహరణకు ఛత్రపతి సినిమాలో హీరోయిజంను చూపించటానికి ప్రభాస్ ఎంట్రీ సొర చేపతో ఫైట్ సీన్ పెట్టి చూపించాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ తో కలిసి RRR చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా ఈ చిత్రానికి సంబందించిన వార్త తెగ చక్కర్లు కొడుతుంది.

ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందట. ఎంట్రీ ఇస్తూనే పులితో ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడట. ఆ ఫైట్ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడని, రియాలిటీ కోసం నిజమైన పులిని కూడా రాజమౌళి తీసుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది.  ఈ ఫైట్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడని, బాడీ కూడా పూర్తిగా చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. అలాటిది ఎన్టీఆర్ తోడు కట్టి పులితో సన్నివేశమంటే మాములుగా ఉండదు. మరి ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలనుంటే జనవరి 8 2021 వరకు ఆగాల్సిందే.

Share on facebook
Share on twitter
Share on whatsapp