కెజిఎఫ్ సినిమాతో ఒక్క రాత్రిలో స్టార్ దర్శకుదిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కెజిఎఫ్ పార్ట్ 2 ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుందని.. ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల రూపాయల పైమాటేనని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌కు కథ వినిపించాడట. అయితే అది పూర్తి కథ కాదని దీనిపై మరోసారి ఇద్దరూ భేటీ అవుతారని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. దానితరువాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారు. 2022లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని ఫిలింనగర్ టాక్ .