యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో హీరోలు కథను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఫ్లాప్ లు పడతాయి. ఇక సినిమాల ఎంపిక సరిగా ఉంటేనే హీరో కెరీర్ కూడా సాఫీగా సాగుతుంది. ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ఆచూతూచీ కథలను ఎంపిక చేసుకుంటారు.
ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా ఫ్లాప్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక ఈ సినిమా మొదట ఎన్టీఆర్ వద్దకే రాగా రిజెక్ట్ చేశాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన నాపేరు సూర్య సినిమా కూడా మొదట ఎన్టీఆర్ వద్దకే వచ్చింది. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ విన్నాడు. కానీ కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన సినిమా బ్రహ్మోత్సవం.ఈ సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరవాత తెరకెక్కింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బంధాలు బంధుత్వాలు అంటూ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. కానీ భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కల్యాణం సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ కు చెప్పగా రిజెక్ట్ చేశాడు. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా నటించిన మరో సినిమా లై…ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.