దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రికార్డులను నెలకొల్పుతున్నాయి.
అయితే అందులో ఎన్టీఆర్ టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. గడచిన 24 గంటల్లో 941కె లైక్, 14.2 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇటువంటి రికార్డ్ ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా కూడా నమోదు చేసుకోలేదట.