యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆది..సరిగ్గా ఈ సినిమా మార్చి 28 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2003 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ నాల్గువ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో ఆది తండ్రి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన విలన్ అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ చిన్న వయసులో ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక తాతల ఆస్తిని ప్రజలకు పంచటం కోసం విలన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటాడు. సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. డైరెక్టర్ వి వి వినాయక్ కి ఈ మూవీ ఫస్ట్ మూవీగా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. మణిశర్మ సాంగ్స్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆది సినిమాకు మరింత ఆకర్షణ చేకూర్చాయి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. అనే డైలాగ్ అప్పట్లో ఫేమస్ అయ్యింది.