‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న క్రేజీ మూవీ ‘ఎన్టీఆర్30’. ఆచార్య ప్లాప్ తర్వాత దర్శకుడు కొరటాలకు ఇది ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కావడం ఎన్టీఆర్ కూడా పెట్టుబడులు పెట్టడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఉన్నారు.
పైగా జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం షూటింగ్ మొదలుపెట్టింది. తొలిరోజు యాక్షన్ సీన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టారు.
కాగా తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు ఓ వీడియోను విడుదల చేశాడు. వస్తున్నా.. అంటూ సెట్స్ లో ఉన్న వీడియోను తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విడుదల చేసిన క్షణాల్లోనే వీడియో తెగ వైరల్ అయింది. కొరటాల శివతో మళ్లీ సెట్స్‌పైకి రావడం ఆనందంగా ఉందంటూ తారక్ వెల్లడించాడు.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం.
యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ సినిమా కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు.
Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO
— Jr NTR (@tarak9999) April 1, 2023