అందాల నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనతికాలంలోనే అగ్ర కథానాయికల సరసన చేరిపోయింది. ఇక ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు సూటిగా చెప్పడం ఈ భామ నైజం.
తాజాగా ఆ తరహాలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను, భవిష్యత్ కోరికలను ఎటువంటి మోహమటం లేకుండా ప్రేక్షకులతో పంచుకుంది.
షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ వీరిలో ఎవరితో నటించడానికి మీరు ఇష్టపడతారు?’ అని అడిగిన ప్రశ్నకు.. జాన్వీ ‘వాళ్లంతా సీనియర్ నటులు. వారికి, నాకు వయస్సులో చాలా తేడా ఉంది. అలాంటి జంటలను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఒప్పుకోరు. కెమిస్ట్రీ కూడా కుదరదు. వయోభేదం ఎక్కువ ఉండటం వల్ల వారితో నటించడం నాకు ఇష్టం లేదు అని సమాధానమిచ్చింది.
ఇక ‘మీ డ్రీమ్ హీరో ఎవరు?’ అని అడిగిన ప్రశ్నకు ‘తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించడం నా డ్రీమ్’ అని బదులిచ్చింది. ఇంకా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్, వరుణ్‌దావన్‌లతో నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ తాజా సినిమా ‘గుడ్‌లక్ జెర్రీ’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతోంది. ఈమె ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిలి’, ‘మిస్టర్ అండ్ మిస్ట్రెస్ మహి’ , ‘బవాల్’చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.