టాలీవుడ్‌లో హీరోలు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ సినిమా ప్రమోషన్స్‌లో సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుందంటూ చెప్పేవారు. కానీ ఇప్పుడు యంగ్ స్టార్స్ మాత్రం వారి మధ్య పోటీ ఎలా ఉన్నా అందరి సినిమాలు హిట్ అవ్వాలంటూ మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన సరిలేరునీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో ఉన్నా మిగిలిన సినిమాలు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత అలవైకుంఠపురములో సినిమా ఫంక్షన్ లో అల్లుఅర్జున్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.
తాజాగా ఎంత మంచివాడవురా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిధిగా వచ్చిన ఎన్టీఆర్ కు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ దర్బార్ సినిమా కానివ్వండి, సరిలేరునీకెవ్వరు కానివ్వండి, అలవైకుంఠపురములో కానివ్వండి, మా ఎంత మంచివాడవురా కానివ్వండి అన్ని సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. హీరోల మధ్య పోటీ ఎలా ఉన్నా ఈ సాంప్రదాయం మాత్రం బాగుందని సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు.