దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాలో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. అయితే ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ బీమ్ ఫర్ రామరాజు అంటూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియో రాంచరణ్ యాక్షన్ , ఎన్టీఆర్ డైలాగ్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
అయితే మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు కూడా ఎన్టీఆర్ కు సంబందించిన ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయబోతున్నారని సమాచారం. ఇక చరణ్ ను అల్లూరి పాత్రలో చూసి ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. మే 20న ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు ఎలాంటి థ్రిల్లింగ్ ఇస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.