– ఠాగూర్.. మీకు ఏ శిక్ష వేయాలి?
– చిరంజీవికి 20 కోట్ల ప్రభుత్వ భూమి
– కట్టబెట్టిన జూబ్లీహిల్స్ సొసైటీ
– నీతులు చెప్పడం కాదు పాటించాలి
– గతంలో ఇలాగే చేసి..కేసులపాలైన కమిటీ
– ఒడువని ముచ్చటగా సొసైటీ పెద్దల కబ్జాలు
– ఎవరున్నాఇదే తంతు అంటున్నసభ్యులు
– బ్యాక్ డోరు ఓపెన్ చేసిన రవీంద్రనాథ్ చౌదరి టీం
– సొసైటీ పై మరిన్నివరస కథనాలు..
– తొలివెలుగు క్రైమ్ బ్యూరో నుంచి..
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలకు నిలువుటద్దంలా మారింది.గజం మూడున్నర లక్షలకు పైగా పలుకుతున్న.. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ విలువకే అంటగట్టి బ్యాక్ డోర్ ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం తాజాగా మెగాస్టార్ చిరంజీవి రోడ్డు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నతీరు సొసైటీ సభ్యులను కలవరపెడుతోంది. ఇన్నాళ్లుగా అనుకున్నది సాధించకపోవడంతో..ఇప్పుడున్నపాలకమండలి తమకు అనుకూలంగా..సమయం కలిసి రావడంతో 595గజాలని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.దీనిపై బుధవారం మున్సిపల్ శాఖ,హౌసింగ్ సొసైటీ అధికారులకి, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అటు.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన రియల్ హీరో మెగాస్టార్ రోడ్డు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.సొసైటీ మాటున ఇప్పటికే పెద్ద ఎత్తున లబ్ధిపొందిన చిరంజీవి ఇప్పుడు మరోసారి 20 కోట్ల భూమిని కేవలం మూడున్నర కోట్లకు దక్కించుకోవటం వెనుక ప్రస్తుత పాలకమండలి అధ్యక్షులు రవీంద్రనాథ్ చౌదరి, ట్రెజరర్ నాగరాజుల హస్తం ఉందంటున్నారు. వీళ్లు అక్రమంగా సుమారు 6 కోట్లు లబ్ధి పొందడంతో పాటు తమ తెరవెనుక పనులను చేయించుకునేందుకు చిరంజీవిని వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి ఇంటి హిస్టరీ..
Plot No. ౩౦౩ N ప్లాట్ నం.లో 3,౩౩౩ చదరపు గజాల కలిగిన భూమిని 1999 వ సంవత్సరంలో కె.చిరంజీవి 120 “x 250 “కొలతలు గల భూమిని కొనుగోలు చేసారు.ఈ భూమికి దక్షిణ దిశగా ఉన్నఖాళీ ప్రదేశం 595 గజాలు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి సంబంధించిన ప్రభుత్వ భూమి, జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఔట్ లో రోడ్డని ఉంది. అయితే చిరంజీవి ఆధీనంలో ఉంటే..జీ.ఓ. నెంబర్ 58,59 ప్రకారం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవాలి. కానీ చిరంజీవికి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో లేఔట్ ను పరిశీలించకుండా ఎంతో రహస్యంగా 595 చదరపు గజాల భూమిని 117”x 47” కొలతలతో ఈనెల 20న కుట్రతో డాక్యుమెంట్ నెంబర్ 2740 -2022 చేయించుకున్నారు.
ప్రస్తుత మార్కెట్ రేట్ ఒక చదరపు గజానికి రు.3,50,000 కాగా ఈ విధంగా 595 చదరపు గజాల భూమి రూ.20.82 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అయితే జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఒక చదరపు గజానికి కేవలం రూ.64,400/- చొప్పున రిజిస్ట్రేషన్ విలువతో మాత్రమే వసూలు చేసిన మొత్తం రు.3.83 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనార్హం. వ్యత్యాసం రూ.16.99 కోట్లు. అయినా ఈ ధరకు కూడా పక్కనే భూమి దొరకడం కష్టం.అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్, కోశాధికారి పి.నాగరాజు తో పాటు పాలకమండలి రూ.12 కోట్లు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో అమ్మకం..!
సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ చౌదరి..కోశాధికారి, పి.నాగరాజు గతంలో కూడా ప్రభుత్వ భూమి ప్లాట్ నం.254-III అమ్మకం చేశారు.రియల్ మాఫియా కుర్ర శ్రీనివాస్ బంధువుకి చెందిన వారికి ఇచ్చారు. 23.07.2021 నాడు పొలీసులు కేస్ నమోదు చేశారు.దీంతో రవీంద్రనాథ్ వ్యవహారశైలిపై సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీటింగుల్లో నీతి వాక్యాలు పలుకుతున్నారు తప్పా.. వ్యవహారాలన్నీ దొంగచాటుగా కానిచ్చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాకు మేలు జరిగేలా వ్యవహరించాల్సిన పాలకమండలి పాత కక్షలు అంటూ దోపిడీ అంటూ మాట్లాడటం.. తప్పా చేతల్లో లేదని, మళ్లీ అదే దారిలో నడవడం జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన రోడ్లన్నీ పార్క్ లోని ప్రదేశాలను కాపాడుకోవడం వాటి ద్వారా అక్రమంగా సంపాదించాలని అత్యాశ ఉండడమే వారి టార్గెటని ఆరోపణలు వస్తున్నాయి.చిరంజీవికి తాజాగా మేలు చేసిన విధానంతో .. రవీంద్రనాథ్ వ్యవహారశైలి బట్టబయలైందని గత పాలకమండలి ప్రచారం చేస్తోంది.
తొలి వెలుగు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పై గతంలో వరుస కథనాలు రాసింది.అక్రమాలను ఎండగట్టింది.వందల కోట్లకు ఎలాఎదిగారని నిలదీసింది. ఇప్పుడు తాజాగా మరోసారి వరుస కథనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మెగా కృష్ణారెడ్డి ఇంటి బాగోతం కబ్జా ఏంటో.. లే అవుట్ ని ఏవిధంగా మార్చారు.. ప్రభుత్వాన్ని ఎలా ఏమారుస్తున్నారో.. రాబోయే కథనంలో చూద్దాం.
Advertisements